యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఈ సందర్భంగా జట్టు ట్రైనర్ ఆడ్రియన్కు కృతజ్ఞతలు తెలిపాడు. తన బౌలింగ్‌తోపాటు ఫిట్‌నెస్‌పై ఆడ్రియన్‌తో కలిసి పనిచేసినట్లు చెప్పాడు. అది బాగా కలిసొచ్చిందని.. తొలి మ్యాచ్‌లో అంతా అనుకున్నట్లుగానే సాగిందని పేర్కొన్నాడు.