SRD: ఆరు సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితునికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ పోక్సో న్యాయమూర్తి జయంతి బుధవారం తీర్పు ఇచ్చారు. బొల్లారంలో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి 3-5-2019 ఆరు సంవత్సరాల చిన్నారిని తన భవనంపైకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. నేరం రుజువు కావడంతో 20 సంవత్సరాల జైలు శిక్షతోపాటు 10 వేల జరిమానా విధించారు.