AKP: జిల్లాలో ఇప్పటివరకు రైతులకు 9,429 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి మోహనరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంకా 131.41 టన్నుల యూరియా అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీన జిల్లాకు మరో 494 టన్నుల యూరియా రానున్నట్లు చెప్పారు. రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందవద్దన్నారు.