గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్గా అశుతోష్ శ్రీవాత్సవ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా ఆయన గుంటూరుకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, డివిజనల్ అధికారి శ్రీనివాసరావు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.