ASR: జీకేవీధి మండలం ధారకొండను ప్రత్యేక మండలంగా ప్రకటించాలని మండల సాధన కమిటీ అధ్యక్షుడు జగన్, గౌరవ అధ్యక్షుడు విష్ణుమూర్తి కోరారు. బుధవారం చింతపల్లిలో ఏఎస్పీ నవజ్యోతి మిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు. స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా ధారకొండ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. ధారకొండ మండలం అయితే చుట్టుపక్కల 6 పంచాయతీలు అభివృద్ధి చెందుతాయన్నారు.