GNTR: స్వచ్ఛ వాయు సర్వేక్షన్లో గుంటూరు నగరానికి జాతీయ స్థాయిలో 6వ ర్యాంక్ దక్కింది. దక్షిణ భారతదేశంలో ఒక్క గుంటూరుకే ఈ గుర్తింపు లభించింది. పచ్చదనం పెంపు, ప్రధాన రహదారుల పరిశుభ్రతతో జాతీయస్థాయి గుర్తింపు దక్కిందని మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు బుధవారం తెలిపారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల సహకారంతో ఇది సాధ్యమైందన్నారు.