కృష్ణా: పెనమలూరు మండలం గంగూరు కట్ట వద్ద నెలకొన్న డ్రైనేజీ సమస్యలను గుర్తించిన యువ నాయకులు బోడే వెంకట్ రామ్ బుధవారం పర్యటించారు. సమస్యలపై పూర్తి సమాచారం సేకరించి, బాధ్యత వహించే అధికారులతో సమీక్ష నిర్వహించారు. త్వరితగతిన శాశ్వత పరిష్కారం చూపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. స్థానికులు ఆయన స్పందనకు కృతజ్ఞతలు తెలిపారు.