ADB: గ్రామ పాలన అధికారుల పోస్టింగుకు సంబంధించి జిల్లాలో 2 విడతల్లో నిర్వహించిన పరీక్షల్లో 83 మంది అర్హత సాధించిన వారికి బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా కౌన్సిలింగ్ నిర్వహించారు. కొత్తగా నియామకం కానున్న GPO లకు విధులపై దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులు సమయస్ఫూర్తి, సంయమనం పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు.