NRML: బాసర మండలంలో ఇటీవల వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. దెబ్బతిన్న పంటలను పూర్తిస్థాయిలో సర్వే చేసి ప్రభుత్వానికి అందజేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు నష్టపరిహారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.