ఆసియా కప్లో భాగంగా యూఏఈతో జరిగిన మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించింది. 58 పరుగుల లక్ష్యాన్ని కేవలం 4.3 ఓవర్లలో ఛేదించి, టీ20లలో వేగవంతమైన విజయాన్ని నమోదు చేసింది. మిగిలిన ఓవర్ల పరంగా ఇది భారత్ అత్యంత వేగవంతమైన విజయం. ఈ రికార్డును అంతకుముందు 2021లో స్కాట్లాండ్పై (13.3 ఓవర్లు మిగిలి ఉండగా గెలిచింది) సాధించిన విజయం ఉండేది.