RR: ఆపద్బాంధవుడిలా ముఖ్యమంత్రి సహాయనిధి దోహదపడుతుందని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ గౌస్ పాషాకు చికిత్స నిమిత్తం సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.2.5 లక్షల విలువగల ఎల్వోసీని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం లాంటిదన్నారు.