HYD: గ్రేటర్ పరిధిలో గంట సేపట్లో పలుచోట్ల ఒక్కసారిగా వర్షం కురిసింది. గరిష్టంగా హస్తినాపురంలో 25 మిల్లీమీటర్లు, బండ్లగూడ 19.3, చంపాపేట 12.3, గన్ ఫౌండరీ 7.8, బంజారాహిల్స్, ఉప్పల్ ప్రాంతాల్లో 5 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఒక్కసారిగా నగరంలో వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది.