అనంతపురంలో జరుగుతున్న ‘సూపర్ సిక్స్- సూపర్ హిట్’ సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కూడా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. సభలో జేసీ అభిమానులు భారీగా పాల్గొన్నారు.