MDK: తూప్రాన్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు వార్డులలోని పేషంట్లతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్, మెడిసిన్ స్టోర్‌ను పరిశీలించి నిత్యం మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రజలందరికీ వైద్యం అందాలని సూచించారు.