ప్రకాశం: పామూరు ఎంపీడీవో కార్యాలయంలో ఇవాళ డీఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్, మండల స్పెషల్ ఆఫీసర్ నారాయణ మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో కనీస మౌలిక వసతులపై ప్రత్యేక కార్యచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. రానున్న వర్షాలు నేపథ్యంలో గ్రామాలలో ప్రత్యేక శానిటేషన్పై శ్రద్ధ చూపాలన్నారు.