NLG: మహారాష్ట్ర, పాండురంగాపురం నుండి విజయవాడ కనకదుర్గ ఆలయం వరకు వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న శ్రీ శ్రీ శంకరానంద అన్నపూర్ణ ఆశ్రమం పాదయాత్ర బృందం బుధవారం చిట్యాలకు చేరుకుంది. బీజేపీ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత కూనూరు సంజయ్ దాస్ గౌడ్ బృందానికి వంట సరుకులను అందజేశారు. సనాతన ధర్మ రక్షణ కోసం పాదయాత్ర చేస్తున్న బృందాన్ని అభినందించారు.