TG: ప్రపంచ రికార్డు లక్ష్యంగా GHMC బతుకమ్మ వేడుకలను నిర్వహించనుంది. అక్టోబర్ 28న ఎల్బీ స్టేడియంలో పది వేల మంది మహిళలతో ఈ వేడుక నిర్వహించనున్నారు. గతంలో 2016లో ప్రయత్నించినా వర్షం కారణంగా అది సాధ్యం కాలేదు. ఈసారి మాత్రం పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు ధీమా వ్యక్తం చేశారు. ఈ వేడుకల కోసం 52 అడుగుల బతుకమ్మను రూపొందిస్తున్నట్లు తెలిపారు.