SRD: సిర్గాపూర్ మండలంలో ZPTC, MPTC ఎన్నికలకు సంబంధించిన ఓటరు లిస్టు తుది జాబితాను MPDO శారద, MPO బ్రహ్మచారి విడుదల చేశారు. వివిధ పార్టీల నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎలాంటి అభ్యంతరాలు లేకపోవడంతో ఫైనల్ జాబితా ప్రచురించామని ఎంపీడీవో తెలిపారు. మండలంలో మొత్తం 24,990 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 12,595, స్త్రీలు 12,394 ఉన్నట్లు పేర్కొన్నారు.