AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. సూర్యలంకలో తాటి మొక్కలు నాటి ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత నగరవనంలో జరిగే జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంలో పాల్గొని అమరవీరుల స్మారక స్తూపాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం అమరవీరుల కుటుంబాలతో సమావేశమై మాట్లాడుతారు.