MDK: పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో బుధవారం బీజేపీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. భారత ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ గెలుపొందడంతో బీజేపీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచారు. మండల బీజేపీ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, మాజీ అధ్యక్షుడు కోణం విట్టల్, సుధాకర్, కృష్ణ, భూషణం, రాజు, ఎర్ర శ్రీహరి పాల్గొన్నారు.