ప్రకాశం: సూపర్ సిక్స్ అట్టర్ ఫ్లాప్ అయిందని దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి దర్శి మండలంలోని బసిరెడ్డిపల్లె గ్రామంలో ‘బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ’ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. గతంలో చేసిన మోసాలే ఈ కూటమి ప్రభుత్వంలో కూడా చేస్తున్నారన్నారు. ఆనాటి రాజన్న రైతు రాజ్యం మళ్లీ రావాలంటే జగనన్నకే సాధ్యమన్నారు.