GDWL: ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో కేటీ దొడ్డి, ధరూర్ మండలాలకు చెందిన పేదింటి ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేద మహిళల పెళ్లిళ్లకు కానుకగా రూ.1,00,116 అందిస్తోందని తెలిపారు.