కోనసీమ: రావులపాలెం మండలంలో యూరియా ఎరువుల నిల్వలపై వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం రావులపాలెం పంచాయతీ కార్యాల వద్ద రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల ప్రత్యేక అధికారి, ఆలమూరు ఎడిఇ సిహెచ్ కె వి చౌదరి మాట్లాడుతూ.. మండల పరిధిలో 668 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందన్నారు.