AP: సూపర్ సిక్స్ పథకాలను ఇతర రాష్ట్రాలూ ప్రశంసిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. కేంద్రం సాయంతో రెండేళ్లలో పోలవరం పూర్తి అవుతుంది.. రాయలసీమకూ నీళ్లు వస్తాయన్నారు. అమరావతికి ప్రత్యేకంగా రూ. 15వేల కోట్ల గ్రాంట్ ఇస్తున్నామన్నారు. కేంద్ర సహకారంతో త్వరలో ప్రజా రాజధాని పూర్తవుతుందన్నారు. ఏడాదిలో రూ.9 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఏపీకి వచ్చాయన్నారు.