»Internet Services Seized In Entire Haryana To Stop Haryana Farmers March
Haryana : హర్యానా రైతుల మార్చ్.. అడ్డుకునేందుకు ఇంటర్నెట్ బంద్!
కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చే చట్టం తీసుకురావాలని, రైతుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు హర్యానా రైతులు చలో ఢిల్లీ మార్చ్‌కు పిలుపునిచ్చారు.
Haryana : కనీస మద్దతు ధరకు హామీ ఇచ్చే చట్టం తీసుకురావాలని, రైతుల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు హర్యానా రైతులు చలో ఢిల్లీ మార్చ్‌కు పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సహా 200కి పైగా రైతు సంఘాలు ఫిబ్రవరి 13న కవాతుకు ప్లాన్ చేశాయి. ఇది ఇలా ఉండగా, రైతుల నిరసన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో హర్యానాలోని ఏడు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.
అంబాలా, కురుక్షేత్ర, కైతాన్, జింద్, హిసార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాల్లో ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్లతో పాటు అన్ని డాంగ్లీ సేవలను నిలిపివేస్తున్నట్లు సీఎం మనోహర్ లాల్ కట్టర్ సర్కార్ అధికారికంగా ప్రకటించారు. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 13 మధ్యాహ్నం 12 గంటల వరకు నిషేధం కొనసాగుతుందని ప్రకటించిన ప్రభుత్వం.. రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు హర్యానా జిల్లాల్లోని ప్రతి సరిహద్దు వద్ద భద్రతా బలగాలను పెంచుతున్నట్లు సమాచారం. ఇంటర్నెట్ సేవలు, ఇతర కమ్యూనికేషన్ మీడియా లేకుండా హర్యానా రైతులు ఈ పాదయాత్రను ఎలా కొనసాగిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.