Hyderabad: హైదరాబాద్లోయూసుఫ్గూడలో జరిగిన సింగోటి రాము హత్య తీవ్ర కలకలం రేపింది. స్నేహితుల పాత కక్షలతో ఒకరు.. పని అయిపోయిందని మరొకరు.. తమ ప్రియురాలిని వేధించాడని ఇంకొకకరు పక్కా ప్లాన్‌తో రాముని హతమార్చారు. పదిమంది కలిసి కత్తితో దాడి చేసి మర్మాంగాలను కోశారు. అయితే ఈ కేసులో పోలీసులు దర్యాప్తులో కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన పుట్ట రాము అలియాస్ సింగోటి రామన్న కోట్లు సంపాదించాడు.
హైదరాబాద్‌లో రియల్ దందా చేయడంతో పాటు జూదం ఆడి రెట్టింపు డబ్బు సంపాదించాడు. ఈక్రమంలో హిమాంబి అనే మహిళ మత్తులో పడ్డాడు. ఆమె డబ్బుల కోసం ఏమైనా చేస్తుంది. ఇదే ఛాన్స్ అనుకున్న హిమాంబి తన దగ్గర ఉన్నదంతా ఊడ్చేసింది. తర్వాత అతనిని వదిలించుకోవాలనుకుంది. అయితే రాము హిమాంబి కూతురు మీద కన్నేశాడు. తన కూతురు అలాంటిది కాదని చెప్పింది. అయితే అతని అడ్డుతొలగించుకోవాలని హిమాంబి పథకం వేసింది.
ఇంతలో రాము స్నేహితులు అతని మీద ఈర్ష్యతో ఉన్నారు. ఇదే ఛాన్స్ అనుకుని హిమాంబి రాము స్నేహితులతో కలిసి తన కూతురుని వాడుకుని అతనిని హత్య చేసింది. 11 మంది రాముపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసి.. మర్మాంగాలను కోసేసి హతమార్చారు. అంతటితో ఆగకుండా తమ కక్ష తీరడంతో రాంరెడ్డినగర్‌లో బార్ వద్ద సంబురాలు చేసుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టగా.. గతంలో ఓ కానిస్టేబుల్ని వశపర్చుకుని.. అతని ఆస్తిని కూడా తీసుకున్నట్లు సమాచారం.