»Aakash Chopra Virat Feels Different Compared To Other Batsmen
Akash Chopra: ఇతర బ్యాటర్లతో పోలిస్తే విరాట్ భిన్నంగా అనిపిస్తాడు
ఇంగ్లాండ్ సిరీస్‌కు విరాట్ లేకపోవడం నష్టమేనని కొందరు మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాత్రం డిఫరెంట్‌గా స్పందించాడు.
Akash Chopra: ఇంగ్లాండ్‌లో మిగిలిన మూడు టెస్టులకు ప్రకటించిన జట్టులో విరాట్ కోహ్లీ లేడు. అయితే విరాట్ ఈ సిరీస్‌కు లేకపోవడం నష్టమేనని కొందరు మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాత్రం డిఫరెంట్‌గా స్పందించాడు. కోహ్లీ జట్టులో లేకపోయిన భారత్ ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను కోల్పోదని అనుకుంటున్నా. నిజాయితీగా చెప్పాలంటే ఒకరు ఉన్నా, లేకపోయిన జీవితం ఆగిపోదు. విరాట్ లేడని కాస్త బాధ ఉండవచ్చు. ఆసీస్‌లో ఆ జట్టును ఓడించినప్పుుడు కూడా విరాట్ లేడు. అడిలైడ్ టెస్టులో కోహ్లీ ఉన్నా ఓడిపోయామన్నారు.
హైదరాబాద్, వైజాగ్ టెస్టుల్లో విరాట్ ఉండి ఉంటే ఏదోక మ్యాచ్‌లో కచ్చితంగా 150+ స్కోరు చేసేవాడు. ఇంగ్లాండ్ బౌలింగ్ కొంచెం వీక్‌గానే ఉంది. ఇలాంటి బౌలింగ్‌తో కోహ్లీని ఆపడం చాలా కష్టం. ముఖ్యంగా రెహాన్ అహ్మద్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. విరాట్ కేవలం నాలుగు బౌండరీలు కొట్టేసి వికెట్ ఇచ్చి వెళ్లడు. ఇంగ్లాండ్ జట్టులో షోయబ్ బషీర్, జాక్ లీచ్, టామ్ హార్ట్లీ ఉన్నాసరే కోహ్లీ మాత్రం 50-70 పరుగులతో ఆపడు. దీనిని భారీ సెంచరీగా మారుస్తాడు. అందుకే ఇతర బ్యాటర్లతో పోలిస్తే విరాట్ భిన్నంగా అనిపిస్తాడని ఆకాశ్ చోప్రా తెలిపారు.