»Prime Minister Modis First Signature Was On The Pm Kisan Fund Giving Priority To Farmers
PMModi: ప్రధాని మోడీ తొలిసంతకం దేనిమీదంటే?
భారత ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తొలిసంతకం రైతుల కోసం పెట్టారు. రాబోయే రోజుల్లో రైతులకు, కార్మికులకు పెద్దపీట వేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Prime Minister Modi's first signature was on the PM Kisan Fund, giving priority to farmers.
PMModi: భారతదేశానికి మూడవ సారి ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించారు. 71 మంది మంత్రులతో ఆదివారం సాయంత్రం ఢిల్లీలో మోడీ ప్రమాణ స్వీకారం చేశారు. అతిరథమహారదుల సమక్షంలో గత రాత్రి ఢిల్లీ జయజయ కేతనలతో మారుమోగింది. సోమవారం ఆధికారాన్ని చేపట్టిన ప్రధాని మోడీ తొలిసంతకం రైతు సంక్షేమంపై పెట్టారు. ఢిల్లీలోని సౌత్ బ్లాక్ పీఎంఓ బ్లాక్‌లోని ప్రధాని క్యాబిన్లో మూడవ సారి తన చైర్లో కుర్చున్నారు. ఈ సందర్భంగా పీఎం కిసాన్ నిధులపై తొలిసంతకం చేసిన రైతులకు పెద్దపీట వేశారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ రైతు, కర్షక, కార్మిక సంక్షేమం కోసం దృష్టిసారించనుందని మోడీ పేర్కొన్నారు. మోడీ సంతకంతో.. దేశవ్యాప్తంగా ఉన్న 9 కోట్ల 30 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. మొత్తం రూ.20 వేల కోట్ల నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లో జమకానున్నాయి.
నూతన కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా ఈ రోజు మోడీ సమక్షంలో తొలి కేబినెట్ సామావేశం నిర్వహించనున్నారు. పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కేబినెట్ అడగనుంది. 2014, 2019 తరువాత ముచ్చటగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ఎన్నికయ్యారు. ఈ సారి కూటమి బలపరచడంతో ఆయన ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ దేశానికి తొలిప్రధాన మంత్రి జవహార్‌లాల్ నెహ్రూ తరువాత మూడో సారి ఫీఎం అయిన వ్యక్తిగా మోడీ చరిత్ర సృష్టించారు.