»Two Day Visit To Russia Prime Minister Modi Reached Moscow
Narendra Modi: రష్యా పర్యటన.. మాస్కోలో ప్రధాని మోడీకి ఘన స్వాగతం
రష్యా, భారత్ ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఉదయం రష్యా బయలుదేరారు. మాస్కో చేరుకున్న మోడీకి విమానశ్రయంలో సాదర స్వాగతం లభించింది.
Two-day visit to Russia.. Prime Minister Modi reached Moscow
Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజులు రష్యా (Russia) పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం ఉదయం ఢిల్లీ (Delhi) ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరారు. ఇదే రోజు సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) మాస్కోకు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో రష్యా తొలి ఉప ప్రధాని డెనిస్ మంటురోవ్ (Denis Manturov) ప్రధాని మోదీకి సాదర స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
రష్యాలో ప్రధాని మోడీ రెండు రోజులపాటు పర్యటించనున్నారు. దీనిలో భాగంగా సోమవారం రాత్రి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కీలక భేటీ కానున్నారు. ఈ సమావేశంలో భారత్-రష్యా ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధానంగా చర్చించనున్నారు. అనంతరం మంగళవారం జరిగే భారత్-రష్యా 22వ వార్షిక సదస్సులో ఇద్దరు అధ్యక్షులు పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని భారత సంతతి రష్యా ప్రజలతో సమావేశం కానున్నారు. వారికున్న సమస్యలను తెలుసుకోనున్నారు. రెండు రోజు పర్యటన ముగిసిన తరువాత ప్రధాని మోడీ ఆస్ట్రియాలో ఒక్క రోజు పర్యటన నిమిత్తం వెళ్లనున్నారు.