జమ్ము కశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు తెగబడ్డారు. ప్రయాణికులు, పర్యాటకులు ఉన్న ఓ బస్సుపై తుపాకులతో కాల్పులు జరిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Terror Attack In Jammu And Kashmir : ఉగ్రవాదులు జమ్ము కశ్మీర్లో మరోసారి విరుచుకుపడ్డారు. ప్రయాణికులు, పర్యాటకులు ప్రయాణిస్తున్న ఓ బస్సుపై తుపాకులతో ఇష్టారీతిన కాల్పులు జరిపారు. దీంతో అదుపు తప్పిన బస్సు(bus) లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో పది మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. మరో 33 మందికి గాయాలు య్యాయి. బస్సు లోయలో పడిపోయిన తర్వాత కూడా ఓ ఉగ్రవాది(terrorist) మరో 20 నిమిషాల పాటు వరుసగా కాల్పులు జరుపుతూనే ఉన్నట్లు గాయపడిన వ్యక్తి ఒకరు మీడియాకు తెలిపారు.
ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు(terrorists) పాల్గొని ఉండొచ్చని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వారు ముఖానికి మాస్కులు ధరించి ఉన్నారని తెలిపారు. అయితే కాల్పుల తర్వాత వారు ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. వారి జాడ ఇప్పటి వరకు తెలియ రాలేదు. దీంతో వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మే నెలలో రాజోరీ, పూంచ్సెక్టార్లలో బస్సును ఉగ్రమూకలు(terrorists) లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాయి. ఇప్పుడు కూడా వారే ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. వారిని పట్టుకునేందనుకు పోలీసులు, భారత ఆర్మీ, సీఆర్పీఎఫ్లు కలిసి సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.