మోదీ 3.0 మొదలైంది. ముచ్చటగా మూడోసారి నరేంద్రమోదీ భారత దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 72 మంది మంత్రులతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
PM Modi: In the first 100 days of coming to power, we will bring a law on Jamili elections!
Modi Cabinet : భారత దేశ ప్రధానిగా నరేంద్రమోదీ(Pm narendra Modi) మూడోసారి ప్రమాణ స్వీకారం చేసి 72 మంది మంత్రులతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. వీరిలో 30 మందికి క్యాబినేట్ మంత్రులుగా పదవులను ఇచ్చారు. మరో 36మందికి సహాయ మంత్రుల హోదా కల్పించారు. మరో ఐదుగురిని స్వతంత్ర హోదాతో స హాయ మంత్రులుగా తీసుకున్నారు. అంటే ప్రతి నలుగురు ఎంపీల్లో ఒకరికి మంత్రి పదవి దక్కిందనే చెప్పవచ్చు.
తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు మంత్రి పదవులు దక్కాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు దేశం పార్టీకి ఎందిన ఇద్దరికి, ఒక బీజేపీ ఎంపీకి కేంద్ర మంత్రి వర్గంలో చోటు ద క్కింది. శ్రీకాకుళంలో వరుసగా మూడోసారి గెలిచిన టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడికి కేంద్ర మంత్రిగా అవకాశం దక్కింది. అలాగే గుంటూరు నుంచి మొదటిసారి గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్, నర్సాపురం ఎంపీగా తొలిసారి పోటీ చేసి గెలిచిన భూపతిరాజు శ్రీనివాస వర్మలకు సహాయమంత్రులుగా అవకాశం కల్పించారు.
ఈ కొత్త మంత్రి వర్గంలో ఒక్క ముస్లిం కూడా లేకపోవడం గమనార్హం. జనరల్ క్యాటగిరీ నుంచి 25 మందికి, ఎస్సీ నుంచి పది మందికి, ఎస్టీ నుంచి ఐదుగురికి, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధ, జైన మతాలకు చెందిన ఐదుగురికి క్యాబినేట్లో సీట్లు దక్కాయి. ఇప్పటి క్యాబినేట్లో మొత్తం 33 మంది కొత్తవారు కావడం గమనార్హం. గత మోదీ క్యాబినేట్లో(Modi Cabinet) పది మంది మహిళలు ఉండగా ఈ సారి మాత్రం ఏడుగురికే అవకాశం దక్కింది. నిర్మలా సీతారామన్, అన్నపూర్ణ దేవికి క్యాబినేట్లో చోటు దక్కింది. అలాగే సహాయ మంత్రులుగా అనుప్రియా పటేల్, నిముబెన్ బంభానియా, సావిత్రీ ఠాకూర్, రక్ష ఖడ్సే, శోభ కరంద్లాజేలు చోటు దక్కించుకున్నారు.