»Naseem Shah Could Not Hold Back Tears As He Failed To Get Pakistan Over The Line Against India
t20 world cup : భారత్ చేతిలో ఓటమిని తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్న పాక్ క్రికెటర్
టీ 20 ప్రపంచ కప్‌లో భాగంగా గత రాత్రి భారత్ - పాక్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ పరాజయం పాలైంది. చిరకాల ప్రత్యర్థిపై ఓడిపోవడాన్ని తట్టుకోలేక పాక్ క్రికెటర్ ఒకరు మైదానంలో కన్నీరు పెట్టుకున్నాడు. ఎవరంటే..?
t20 world cup : భారత్ – పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎప్పుడూ అందరికీ ఆసక్తే. రెండు జట్లు కూడా ఎలాగైనా నెగ్గాలని సర్వ శక్తులూ వడ్డుతుంటాయి. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం రాత్రి న్యూయార్క్‌లోని నసావు కౌంటీ క్రికెట్ స్టేడియంలో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఓడిపోవడంతో పాక్ క్రికెటర్ నసీమ్ షా(Naseem Shah) మైదానంలోనే కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో పక్కనున్న అఫ్రీదీ అతడిని ఓదార్చాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే ఆలౌటైంది. 119 పరుగుల లక్ష్యాన్ని పాక్‌కి అందించింది. ఈ సమయంలో అంతా పాక్ గెలుపు ఖాయం అనుకున్నారు. కానీ భారత బౌలర్ బుమ్రా విజృభించాడు. మూడు వికెట్లు తీసి పాక్‌ని కోలుకోలేని దెబ్బ తీశాడు. చివరి వరకు ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. క్రీజ్‌లో ఉన్న నసీమ్ షా(Naseem Shah) నాలుగు బంతులు ఆడి రెండు ఫోర్ల సాయంతో పది పరుగులు చేశాడు. అయినా ఈ మ్యాచ్ చివరికి ఆరు పరుగుల తేడాతో పాక్ ఓడిపోయింది.
క్రీజులో ఉండి కూడా తన జట్టును గెలిపించుకోలేకపోవడంతో నసీమ్(Naseem) భావోద్వేగానికి లోనయ్యాడు. మైదానం నుంచి బయటకు వెళుతూనే కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో అతని పక్కనే ఉన్న అఫ్రీదీ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశాడు.
Even Naseem Shah, our young bowler, played better than our highly paid batsmen. The time has come, if you’re not performing well, please resign gracefully and let others join. It’s time to take strict decisions, or they’ll never understand. #PakvsIndpic.twitter.com/kkV9LZntFX