»Pm Modi More Than 370 Seats For Bjp In Lok Sabha Elections
Pm Modi: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 370కు పైగా సీట్లు మావే!
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370కి పైగా స్థానాలను గెలుచుకొంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఒక్కో బూత్‌లో 370 ఓట్లు అదనంగా పోలయ్యేలా చూడాలని మోదీ తెలిపారు. 370 స్థానాలకు పైగా బీజేపీ గెలిచేలా ఆశీర్వదించాలని కార్యకర్తలను, ఓటర్లను కోరారు.
Pm Modi: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370కి పైగా స్థానాలను గెలుచుకొంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఒక్కో బూత్‌లో 370 ఓట్లు అదనంగా పోలయ్యేలా చూడాలని మోదీ తెలిపారు. 370 స్థానాలకు పైగా బీజేపీ గెలిచేలా ఆశీర్వదించాలని కార్యకర్తలను, ఓటర్లను కోరారు. ఈరోజు మధ్యప్రదేశ్‌లో పర్యటించిన ప్రధాని రూ. 7,550 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసమే రాలేదని.. ప్రజా సేవకుడిగా మాత్రమే వచ్చానని మోదీ తెలిపారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్.. 2024లో తుడిచిపెట్టుకుపోవడం ఖాయం. ఆ పార్టీకి ఎన్నికల సమయం వస్తేనే గ్రామాలు, పేదలు, రైతులు గుర్తుకొస్తారన్నారు. సికిల్‌సెల్ అనీమియాకు వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు చేపట్టింది ఆదివాసీ ప్రజల ఆరోగ్యం కోసమే. కాంగ్రెస్ నినాదం దోచుకోవడం, విభజించడమే. గుజరాత్లో గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు లేకపోవడంతో విద్యాభ్యాసం కోసం పిల్లలు కిలో మీటర్ల మేర నడవడం చూశాను. నేను సీఎం అయ్యాక ఆయా ప్రాంతాల్లో స్కూళ్లను తెరిపించాను. ఇప్పుడు గిరిజన పిల్లల కోసం దేశ వ్యాప్తంగా ఏకలవ్య పాఠశాలలు ప్రారంభిస్తున్నాం. కాంగ్రెస్ ఇన్నేళ్లలో కేవలం 100 ఏకలవ్య స్కూళ్లను పెడితే.. బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో భారీ సంఖ్యలో స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని మోదీ తెలిపారు.