AP: రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ‘ఆర్థిక ఇబ్బందులు ఉన్నా.. సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాం. ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్యబీమా కల్పించాం. ఒకే రోజు రికార్డు స్థాయిలో గ్రామసభలు నిర్వహించాం. కోటి మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టాం. 2047 వరకు దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ 1గా తీర్చిదిద్దుతాం’ అని అన్నారు.