NLG: దేవరకొండలో గణేష్ శోభాయాత్రలో జరిగిన సంఘటనపై ఆర్యవైశ్య సంఘం నాయకులు పోలీసులకు క్షమాపణలు తెలిపారు. ఆసంఘటన యాదృచ్ఛికంగా జరిగిందని, ఉద్దేశపూర్వకంగా ఎవరిని కించపరచలేదని స్పష్టం చేశారు. కొందరి అత్యుత్సాహం వల్ల అంతరాయం కలిగిందని పేర్కొన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేయడం తమ ఉద్దేశం కాదని చెప్పారు. జరిగిన సంఘటనకు తాము చింతిస్తున్నామని వారు పేర్కొన్నారు.