నేపాల్లో పరిస్థితులు కొలిక్కివస్తున్నాయి. తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి నియామకమయ్యారు. సుశీలా కర్కి నాయకత్వాన్ని నేపాల్ ఆందోళనకారులు అంగీకరించారు. నేపాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా, గత కొంతకాలంగా నేపాల్లో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే.