తమిళ హీరో విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబోలో మూవీ రాబోతుంది. తాజాగా ఈ చిత్రబృందం మెగాస్టార్ చిరంజీవిని కలిసింది. HYDలో జరుగుతోన్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ షూటింగ్ సెట్లోకి పూరి టీం వెళ్లి.. చిరు బ్లెస్సింగ్స్ తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటో SMలో వైరల్ అవుతోంది. ఇక ఈ ఫొటోలో చిరుతో పాటు విజయ్ సేతుపతి, టబు, నయనతార, ఛార్మి, అనిల్ రావిపూడి తదితరులు ఉన్నారు.