CM Revanth Reddy: We will waive the loan by August 15
Revanth Reddy : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంటలో నిర్వహించిన జనజాతర సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీ ఆంధ్రప్రదేశ్ కు మట్టి, తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఇక్కడకు వలస వస్తే తెలంగాణ వాదం కోసం గెలిపించారని, పాలమూరుకు వస్తే మేమూ గెలిపించామన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలు సెమీఫైనల్స్ మాత్రమేనని…. ఇప్పుడు జరిగే ఎన్నికలు ఫైనల్స్ అని.. సెమీస్ లో కేసీఆర్ ను జనాలు చిత్తుగా ఓడించారన్నారు. ఈ ఎన్నిక్కల్లోనూ బీఆర్ఎస్, బీజేపీ లను ఓడించాలని ఓటర్లకు సూచించారు. విభజన హామీలను అమలు చేయని బీజేపీ.. తెలంగాణ ఏర్పాటుని పార్లమెంట్ సాక్షిగా అవహేళన చేసి అవమానించారన్నారు. తెలంగాణ ఏర్పాటును అవమానిస్తుంటే బండి సంజయ్ ఏమి చేశారని ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే నిజామాబాద్ గుండు, కరీంనగర్ అరగుండు ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాకుండా..’అయోధ్యలో రాముని కల్యాణం జరగక ముందే అక్షింతలు పంచి రాముడిని బీజేపీ అవమానించింది. మేమంతా హిందువులమే.. శ్రీరాముడు మాకు కూడా దేవుడే.. హిందుత్వాన్ని దేవుడిని ఓట్లకోసం మేం వాడుకోం.. గుండు, అరగుండు.. కరీంనగర్, నిజామాబాద్ లలో బస్టాండ్ లో దేవుని బొమ్మ పెట్టుకుని చిల్లర అడుక్కున్నట్టు.. జనాలను రాముని బొమ్మతో ఓట్లు అడుక్కుంటున్నారు. బీసీ జనగణకు మేము ప్రయత్నం చేస్తుంటే బీజేపీ ఉన్న రిజర్వేషన్లను రద్దు చేసే కుట్రలు చేస్తుంది. బీజీపీ 400 సీట్ల నినాదం వెనక కుట్ర ఉంది.. మూడింట రెండువంతుల సీట్లు పొంది రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు. ఈ దేశ మూలవాసులైన ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేయలనుకుంటున్నారో చెప్పాలి. నేను వేదికల మీద మాట్లాడిన మాటలకు ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చారు.. పదేళ్లుగా కేసీఆర్ నన్ను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఇంటికి పోయాడు. కేసీఆర్ బస్సు యాత్ర తిక్కలోడు తిరునాళ్లకు పోయినట్టు ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని డమ్మీ అభ్యర్థులను పెట్టుకున్నారు. రామప్ప దేవుని మీద ఒట్టేసి చెబుతున్న ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. చదవండి:PM Modi: నేను బతికున్నంత వరకు రాజ్యాంగాన్ని కాపాడుతాను