NLG: నల్గొండలో చికెన్ ధర రూ.300 దాటింది. బర్డ్ ఫ్లూ వల్ల ఉత్పత్తి తగ్గి, కిలో స్కిన్లెస్ రూ.290-310, లైవ్ కోడి రూ.185కి చేరాయి. గుడ్డు ధర రూ.8.50 పలుకుతోంది. పండగ వేళ ధరలు పెరగడంతో మాంసం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పట్లో ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నారు.