»I Will Protect The Constitution As Long As I Live Pm Modi
PM Modi: నేను బతికున్నంత వరకు రాజ్యాంగాన్ని కాపాడుతాను
తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోడీ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటుగా వ్యాఖ్యానించారు. బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది అని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని, రాజ్యంగమే తనకు పవిత్రగ్రంథం అని పేర్కొన్నారు.
PM Modi: రాజ్యాంగమే నా ధర్మగ్రంథం, బతికి ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని కాపాడుతాను అని ప్రధాని మోడి ప్రసంగించారు. ఈ రోజు తెలంగాణలోని మెదక్ జిల్లా అల్లాదుర్గంలో ఎన్నికల ప్రచారంలో ప్రధాని పాల్గొన్నారు. దళితులు, ఎస్టీలు, ఓబీసీలకు రిజర్వేషన్లకు ఎలాంటి ఆటంక రాకుండా చూసుకుంటానని, అలాగే ముస్లీంలకు రిజర్వేషన్లు అమలు చేసే ప్రసక్తి లేదని అన్నారు. కాంగ్రెస్ మాటలను ప్రజలకు నమ్మడం లేదని, బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని.. నిజానికి కాంగ్రెస్ వస్తే రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుంద మోడీ అన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బంజారా సమాజాన్ని దారుణంగా మోసం చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి అంబేడ్కర్ అంటే గౌరవం లేదని, రాజ్యాంగానికి కూడా వ్యతిరేకమని వెల్లడించారు. ఎమెర్జెన్సీ వధించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ఎద్దేవా చేశారు. రాజీవ్ గాంధీ హయాంలో స్వేచ్ఛ లేదని అన్నారు. రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథంలా భావిస్తానని, ఆయన రెండోసారి ప్రధాని అయ్యాక రాజ్యాంగాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఏర్పాటు చేసినట్లు గుర్తుచేసుకున్నారు. రాజ్యాంగం అంటే మహాభారతం, రామాయణం, బైబిల్, ఖురాన్ వంటి పవిత్ర గ్రంథమని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.