పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ‘మమతా దీదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’ అని ప్రధాని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన విషెస్ తెలియజేశారు. రాజకీయంగా ఇరువురి మధ్య వైరం ఉన్నప్పటికీ, మోదీ ఆమెకు విషెస్ చెప్పడం అందరినీ ఆకట్టుకుంటోంది.