AP: భోగాపురం విమానాశ్రయంపై జగన్ విమర్శలు మానుకోవాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎర్రబస్సు రాని ఊళ్లకు ఎయిర్పోర్టు ఎందుకని నాడు హేళన చేసి.. ఇవాళ మాట్లాడటం చూస్తుంటే ఏమనాలి అని ప్రశ్నించారు. జగన్ను ఇలాగే వదిలేస్తే.. దేశానికి స్వాతంత్ర్యం తన తాతే తెచ్చారంటారేమో..? ఇలాంటి నేతల వల్లే రాజకీయ నేతలపై ప్రజలకు గౌరవం తగ్గిపోతోందన్నారు.