VZM: చింతలవలసలోని ఏపీఎస్పీ 5వ బెటాలియన్లో నిర్వహిస్తున్న 37వ వార్షిక క్రీడా పోటీలను కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి, సమష్టి తత్వాన్ని అలవర్చుకునేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడలను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.