Golmaal in ORR Lease Tenders: BJP MLA Raghunandan Rao
Raghunandan Rao: మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మెదక్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను రఘునందన్ రావు ఖండించారు. తమ పార్టీ బీజేపీపై సీఎం రేవంత్‌రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చేందుకే సర్జికల్ స్ట్రైక్ చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని, 400 సీట్లు వస్తే మోడీ రాజ్యాంగాన్ని మారుస్తారని రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలపై సర్జికల్ స్ట్రైక్ జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు.. అంబేడ్కర్ మళ్లీ పుట్టి వచ్చి రాజ్యాంగాన్ని మార్చాలని చూసినా.. అది మార్చడం జరుగదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారని రఘునందన్ రావు పేర్కొన్నారు.
పదేళ్లు అధికారంలో ఉండి కూడా రాజ్యాంగాన్ని మార్చలేదన్నారు. ఇప్పటికీ, రాజ్యాంగం 106 సార్లు సవరించబడింది. వాటిలో మెజారిటీ కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని సీఎం గుర్తు చేసుకోవాలని సూచించారు. సెక్యులరిజం అనే పదం రాజ్యాంగంలో లేకపోయినా ఇందిరా గాంధీ రాజ్యాంగంలో చేర్చారు. కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్‌ను ఎన్నికల్లో ఓడించింది. తనకు భారతరత్న ఇచ్చే ధైర్యం కాంగ్రెస్ పార్టీ చేయలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని దుయ్యబట్టారు. మరోవైపు.. బీఆర్ఎస్పై రఘునందన్‌రావు మండిపడ్డారు. జై శ్రీరామ్ అంటే కేసీఆర్, కేటీఆర్ కు ఎందుకు బాధ అని ప్రశ్నించారు. జై శ్రీరామ్ కాకుండా జై కేసీఆర్ అనాలా అని విమర్శించారు. కేసీఆర్ వంద అబద్ధాలు చెబితే, రేవంత్ వెయ్యి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని అన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు విడదీయరాని కవలలు అని అబద్ధాలు చెబుతున్నారని తీవ్రంగా విమర్శించారు.