Serial Actor Hari Exclusive Interview HitTVSpecials
Exclusive Interview: మద్రాసులో సినిమా ప్రస్థానం మొదలైందని ఆ సమయంలో తన కుటుంబాన్ని చాలా ఇబ్బందులు పెట్టానని సిరీయల్ యాక్టర్ హరి చెప్పారు. ఎక్కువగా చిరంజీవి సినిమాల్లోనే నటించానని దానికి గల కారణం ఎంతో ఆసక్తిగా చెప్పారు. జీవితంలో అంతా పోగొట్టున్న తరువాత మళ్లీ చిరంజీవిని కలవడానికి ఇంటికి వెళ్తే సురేఖ వచ్చి చూడడం తన అదృష్టమని వెల్లడించారు. ఆ తరువాత హైదరాబాద్కు వచ్చి యండమూరి సీరియల్లో నటించాను అని వివరించారు. అప్పట్లో ప్రామ్టింగ్ ప్రాసెస్ ఉండేది దాని వలన చాలా స్ట్రగుల్ అయ్యాను. దాన్ని గమనించిన యండమూరి నాకు ఒక సలహా ఇచ్చారు. దాంతో తలరాత మారిపోయింది అని తెలిపారు. సీరియల్స్ రావడం వలన చాలా ప్లస్ జరిగిందని చెప్పారు. కస్తూరి సీరయల్ సమయంలో జరిగిన ఓ గమ్మత్తు పరిస్థితిని వివరించారు. ఇక సింహాద్రి సినిమాలో ఆయన నటించడం వెనుక జరిగిన కథ, దానికి గల కారకుడు ఎవరో చెప్పారు. మగధీరలో కూడా నటించడం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. రాఖీ సినిమా, గమ్యం సినిమా ఎందుకు అంత స్పెషలో వివరించారు. ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి.