»Gujarat Titans Vs Royal Challengers Bengaluru Ipl 2024
RCB vs GT: ఆర్సీబీ బ్యాటర్ల వీరవిహారం. బెంగళూరు ఘన విజయం
ఐపీఎల్ 2024లో 45వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు జట్లు ముఖాముఖి తలపడ్డాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.
RCB vs GT: ఐపీఎల్ 2024లో 45వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు జట్లు ముఖాముఖి తలపడ్డాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ పై ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో బెంగుళూరు గెలిచింది. ఈ మ్యాచ్ లో విల్ జాక్స్ సెంచరీతో చెలరేగాడు. 24 బంతులు ఉండగానే బెంగళూరు విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన ఆర్సీబీ గుజరాత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ సీజన్లో ఇప్పటివరకు గుజరాత్, ఆర్సీబీ రెండు జట్ల ప్రదర్శన చాలా నిరాశాజనకంగా ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 200 పరుగులు చేసింది. దీంతో ఆర్సీబీ కేవలం 16 ఓవర్లలోనే విజయం సాధించింది. అందుకు విల్ జాక్వెస్ అజేయ సెంచరీ సాధించాడు. 41 బంతుల్లో 100 పరుగులు చేశాడు. జాక్వెస్ ఈ ఇన్నింగ్స్‌లో 10 సిక్స్‌లు, 5 ఫోర్లు ఉన్నాయి. విరాట్ కోహ్లీ 44 బంతుల్లో 70 పరుగులతో అజేయంగా నిలిచాడు. కోహ్లి 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. 24 పరుగుల వద్ద ఫాఫ్ డు ప్లెసిస్ అవుటయ్యాడు. మోహిత్ శర్మ 2 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చాడు. సాయి కిషోర్ 3 ఓవర్లలో 30 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున సాయి సుదర్శన్ 84 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. షారుక్ ఖాన్ 58 పరుగులు చేశాడు. డేవిడ్ మిల్లర్ 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ సమయంలో స్వప్నిల్ సింగ్, మహ్మద్ సిరాజ్, మాక్స్వెల్ ఒక్కో వికెట్ తీశారు.