IPL 2024: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్‌లో ఏ జట్లు ఉన్నాయి?
ఐపీఎల్ సీజన్ కీలకదశకు చేరుకుంది. గురువారం వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ ఫిక్స్ అయింది. ఇక చివరి స్థానంలో ప్లేస్ సంపాదించాడానికి నాలుగు జట్లు తలపడుతున్నాయి.
Match canceled due to rain.. SRH play offs chance?
IPL 2024: ఐపీఎల్ 2024లో కీలకదశకు చేరుకుంది. ప్లే ఆఫ్‌కు తొలి మూడు స్థానాల్లో మూడు టీమ్‌లు ఫిక్స్ అయ్యాయి. ఇక చివరి నాలుగో స్థానం కోసం నాలుగు టీమ్‌లు తలపడుతున్నాయి. అయితే గత రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దయిన విషయం తెలిసింది. భారీ వర్షం కారణంగా ఆట సాగకపోవడంతో రెండు టీమ్‌లకు చెరో పాయింట్ లభించింది. దాంతో ఎస్ఆర్హెచ్ 15 పాయింట్లతో ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇందులో 19 పాయింట్ల ఆధిక్యంతో కోల్‌కతా నైట్ రైడర్స్ తొలిస్థానంలో, 16 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ రెండో స్థానంలో ఉన్నాయి. గురువారం మ్యాచ్ కాన్సెల్ కావడంతో ఎస్ఆర్హెచ్ మూడవ స్థానాన్ని ఖాయం చేసుకుంది.
మిగిలిన ఒక్క స్థానం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీలో ఉన్నాయి. ముఖ్యంగా సీఎస్కే, ఆర్సీబీలకే ప్లే ఆఫ్‌కు వెళ్లే ఛాన్స్ ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ 14 పాయింట్లు, +0.528 నెట్ రన్ రేట్‌తో ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 12 పాయింట్లు, +0.387 నెట్ రన్ రేట్‌తో ఉంది. ఈ రెండు జట్ల మధ్య చివరి మ్యాచ్ జరగనుంది. ఏది విజయం సాధిస్తే అది ప్లే ఆఫ్ ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఆర్ఆర్, ఎస్ఆర్హెచ్ జట్లు తమ ఆఖరి మ్యాచ్‌ల్లో ఓడిపోయి.. ఆర్సీబీపై చెన్నై గెలుపొందితే మంచి రన్ రేట్‌తో టాప్-2 స్థానంలో ఉండే అవకాశం చెన్నైకి ఉంది.