గత సీజన్ కన్న ఈ ఐపీఎల్ సీజన్ పరుగుల వరద చూస్తోంది. రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతుంది. గత రాత్రి ఎస్ఆర్ఎచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్‌లో సైతం అరుదైన రికార్డులు నెలకొన్నాయి.
IPL-2024: ఐపీఎల్ – 2024 సీజన్ 17లో ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనకు పరుగుల వరద పారుతోంది. బౌలర్లపై విరుచుకపడుతున్న బ్యాటర్లు బంతినిగాల్లో ఉంచడానకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఐపీఎల్ జట్లు 8 సార్లు 250 స్కోర్‌ను దాటి అరుదైన ఘనత సాధించారు. అంతే కాదు సిక్స్‌లతో కూడా మరో రికార్డును చేధించారు. గత రాత్రి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ జరిగింది. ఈ ఆటలో మరో రికార్డు నెలకొంది. అతి తక్కువ బంతుల్లో 1000 సిక్సులు కొట్టిన రికార్డు నమోదైంది. కేవలం 13,079 బంతుల్లో 1000 సిక్సులు సాధించారు. గతంలో ఈ రికార్డు 15,390 బంతుల్లో వెయ్యి సిక్సులు కొట్టారు. అంతకు ముందు అంటే 2022 ఐపీఎల్ సీజన్లో 16,269 బంతుల్లో వెయ్యి సిక్సులు కొట్టారు.
ఈ క్రమంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ సైతం ఓ రికార్డును సాధించింది. అతి తక్కవ ఓవర్లోనే టార్గెట్ ఛేస్ చేయడమే కాకుండా ఆడిన 12 మ్యాచ్‌లలోనే 146 సిక్స్‌లు బాదింది. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ 145 సిక్స్‌లను నిన్నటి ఆటలో రికార్డును బద్దలు కొట్టింది. అలాగే ఈ సీజన్లో పవర్ ప్లేలోనే ఎక్కువ సిక్సులు నమోదయ్యాయి. ఎస్ఆర్ఎచ్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ ఐపీఎల్ 2024లో ఎకంగా 23 సిక్స్‌లు పవర్ ప్లేలోనే బాదాడు. అలాగే ట్రావిస్ హెడ్ సైతం 23 సిక్సులు కొట్టాడు. గతంలో 2008లో సనత్ జయసూర్య ముంబై ఇండియన్స్ తరుఫున 22 సిక్సులు కొట్టాడు.