టాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు కిరణ్ కుమార్ కన్నుమూశాడు. గతంలో అక్కినేని నాగార్జునతో కిరణ్ ‘కేడి’ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఆయన తాజాగా దర్శకత్వం వహించిన ‘కేజేక్యూ: కింగ్.. జాకీ.. క్వీన్’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఆ సినిమా విడుదల కాకముందే కిరణ్ చనిపోవడం బాధాకరమని పలువురు పేర్కొంటున్నారు.