కోనసీమ: ముమ్మిడివరం కేశవ స్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఆలయ సంప్రదాయాలను కాపాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ట్రస్ట్ బోర్డు పనిచేయాలని MLA దాట్ల సుబ్బరాజు సూచించారు. ఈ సందర్భంగా ఆయన ట్రస్ట్ బోర్డు ఛైర్మన్, సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.